Mirai Box Office: బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ ఫస్ట్ డే వసూళ్లను బ్రేక్ చేసిన ‘మిరాయ్’.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Mirai Box Office: బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ ఫస్ట్ డే వసూళ్లను బ్రేక్ చేసిన ‘మిరాయ్’.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ మూవీ వసూళ్ల సునామి సృష్టిస్తుంది. కార్తీక్ తెరకెక్కించిన మైథలాజికల్ మిరాయ్, బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’మూవీ ఓపెనింగ్ను అధిగమించింది.

మిరాయ్ తొలిరోజు (సెప్టెంబర్ 12న) ఇండియాలో రూ.12 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది తేజ కెరీర్లో అతిపెద్ద డే 1 ఓపెనింగ్గా నిలిచింది. 2024లో విడుదలైన తన హనుమాన్ మూవీ రికార్డును అధిగమించి, మిరాయ్తో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు తేజ. హనుమాన్ విడుదలైన మొదటి రోజే, ఇండియాలో రూ.8 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. 

ట్రేడ్ వెబ్‌సైట్ ప్రకారం, మిరాయ్ మొదటి రోజు (శుక్రవారం) తెలుగులో 68.59% , హిందీలో 10.86% మొత్తం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ క్రమంలో 'మిరాయ్'కు తెలుగులోనే అత్యధిక వసూళ్లు చేసింది. దాదాపు రూ.10.60 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. హిందీలో రూ.1.25 కోట్లు, తమిళంలో రూ.5 లక్షలు, మలయాళంలో రూ.5 లక్షలు, కన్నడలో రూ.5 లక్షలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

ఇలా  మిరాయ్ ఇండియాలో తొలిరోజు మొత్తం నెట్ కలెక్షన్ రూ.12 కోట్లు రాబట్టగా.. వరల్డ్ వైడ్గా రూ.23-రూ.25 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు టాక్. ఇదిలా ఉంటే.. అమెరికాలో 700K డాలర్స్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఇందులో థ్రిల్ చేసే VFX విజువల్స్ని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్లో ఇంతటి అవుట్ పుట్ ఎలా రాబట్టగలిగాడంటూ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అభినందిస్తూ మెసేజెస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే బుకింగ్స్ సైతం జోరుగా కొనసాగుతున్నాయి. వీకెండ్ మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సమాచారం.