రేపు(అక్టోబర్ 07) బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఆక్రోష్ మార్చ్’ : ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్

రేపు(అక్టోబర్ 07) బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఆక్రోష్ మార్చ్’ :  ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్

పాట్నా: ఓటర్ల జాబితా సవరణ (సర్) అక్రమాలకు నిరసనగా ఈనెల 7న బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 'ఆక్రోష్ మార్చ్' నిర్వహిస్తామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోమవారం ప్రకటించారు. ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా 8న జిల్లా స్థాయి ఆందోళనలతో పాటు గవర్నర్ నివాసానికి ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగానే సీఈసీ జ్ఞానేశ్​ కుమార్ పనిచేస్తున్నారని, ఆయన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 

ఓటర్ల జాబితా సవరణలో లక్షలాది పేర్లు తొలగించారని, బిహార్, బెంగాల్ ఎన్నికలు మోసపూరితమని ఆరోపించారు. అక్రమాలపై వినతిపత్రం ఇచ్చేందుకు  ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు 8న గవర్నర్ నివాసానికి ర్యాలీగా వెళ్తాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.