రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చుండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్..

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చుండూరు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్..

నల్గొండ జిల్లా చుండూరులో ఏసీబీకి వలకు చిక్కారు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్. రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్ ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గట్టుపల్ మండలం తెరెడ్డిపల్లి గ్రామంలో అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద బాధితులు వివరాలు కోరగా.. వివరాలు ఇవ్వడం కోసం రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశారు చంద్రశేఖర్. ఈ క్రమంలో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు హైదరాబాద్ లోని బాలాపూర్ లో ఉన్న చంద్రశేఖర్ నివాసంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా.. గురువారం(డిసెంబర్ 4)  రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్  అసిస్టెంట్ డైరెక్టర్ కోతం శ్రీనివాసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ సోదాల్లో శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్​ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. శ్రీనివాసులుపై  అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. 

రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఈడీగా శ్రీనివాస్​ పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లోని రాయదుర్గం, మై హోం భుజ అపార్టుమెంటులో ని శ్రీనివాసులు నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. ఆయన ఇళ్లతో పాటు కలెక్టరేట్​లో సైతం సోదాలు చేపట్టారు. శ్రీనివాసులు ఇంటితోపాటు ఆయన బంధువులు, మిత్రులఇళ్లపై సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి.