ఉద్యమకారులను కేసీఆర్ మర్చిపోవడం బాధాకరం

ఉద్యమకారులను కేసీఆర్ మర్చిపోవడం బాధాకరం
  •    తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్

ముషీరాబాద్, వెలుగు :  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ మేనిఫెస్టోలో  తెలంగాణ ఉద్యమకారుల ఊసెత్తకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేర్కొంది. ఆదివారం బాగ్‌‌‌‌ లింగం పల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫోరం చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉద్యమకారులను మరిచిపోవడం బాధాకరమన్నారు.  వెంటనే మేనిఫెస్టోలో ఉద్యమకారుల అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమ కారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రతినెల పెన్షన్, సంక్షేమ పథకాల్లో 20 శాతం కోటా కేటాయించాలని కోరారు.

ఉచిత బస్ పాస్, రైల్వే పాస్, ఆరోగ్య కార్డు ఇచ్చి తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ చైర్మన్‌‌‌‌గా డాక్టర్ కేవీ  కృష్ణారావు, కన్వీనర్‌‌‌‌‌‌‌‌గా పటోళ్ల సురేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మహిళా కన్వీనర్‌‌‌‌‌‌‌‌ జ్యోతి రెడ్డి, వెంకటేశ్ గౌడ్, ఎల్లయ్య యాదవ్, నారాయణ సింగ్, కుమార స్వామి, షేక్ చాంద్ పాషా తదితరులను ఎన్నుకున్నారు.