ఉద్యమకారుల త్యాగాలకు న్యాయం జరిగేలా తుది నివేదిక

ఉద్యమకారుల త్యాగాలకు న్యాయం జరిగేలా తుది నివేదిక
  •     ‌‌వర్సిటీల విద్యార్థి నాయకులతో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ భేటీ

హైదరాబాద్, వెలుగు: ఉద్యమకారుల త్యాగాలకు తగిన న్యాయం జరిగేలా తుది నివేదికను సిద్ధం చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తెలిపింది. ఈ నివేదికను అత్యంత పారదర్శకంగా రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. అమర జ్యోతి ఆఫీస్​లో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన వర్సిటీల విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు విజయవంతంగా 3 రోజులు నిర్వహించారు. 

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల విద్యార్థి ఉద్యమకారులతో చర్చలు జరిపారు. కమిటీ సమావేశాల్లో  విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అధ్యాపక ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. జేఎన్‌టీయూహెచ్, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన వర్సిటీల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు వర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీల మలిదశ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో వచ్చారు.