ప్రకృతి వ్యవసాయ పథకం అమలు కు అధికారుల నియామకం

ప్రకృతి వ్యవసాయ పథకం అమలు కు అధికారుల నియామకం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాష్ట్రంలో అమలవుతున్న జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని (ఎన్‌‌‌‌ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్) సమర్థవంతంగా అమలు చేసేందుకు ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పదవులను ఔట్‌‌‌‌సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 

ఈ పదవులకు అర్హత గల అభ్యర్థులను అందించగల ఔట్‌‌‌‌సోర్సింగ్ ఏజెన్సీలు అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని ఆ శాఖ అధికారులు కోరారు. ఈ నియామకాలకు సంబంధించిన అర్హతలు, జీతం, ఇతర నియమ నిబంధనల వివరాల కోసం వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని డైరెక్టర్ గోపి వెల్లడించారు.