తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షం.. హైదరాబాద్ లో మోస్తరు వాన

తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షం.. హైదరాబాద్ లో మోస్తరు వాన

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షం పడనున్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. 2023, నవంబర్ 7వ తేదీ రాత్రి హైదరాబాద్, మల్కాజిగిరి, కొత్తగూడెం,  ఖమ్మం,  నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం పడనున్నట్లు అలర్ట్ ఇచ్చింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడనుండగా.. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడనున్నట్లు స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నాయని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది వెదర్ డిపార్ట్ మెంట్. ఈ సూచనలు, హెచ్చరికలు రాత్రి 7 నుంచి 10 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. రాబోయే రెండు రోజులు.. అంటే నవంబర్ 8, 9 తేదీల్లోనూ చెదురు మదురు వర్షాలు పడతాయని స్పష్టం చేస్తూ.. పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది.