లాజిస్టిక్స్ హబ్‌‌‌‌గా తెలంగాణ

లాజిస్టిక్స్ హబ్‌‌‌‌గా తెలంగాణ

హైదరాబాద్​, వెలుగు:  భారతదేశ తూర్పు, పడమటి పోర్టులను అనుసంధానించే లాజిస్టిక్స్ హబ్‌‌‌‌గా తెలంగాణ ఎదగనుందని తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల డైరెక్టర్ జె. నిఖిల్ చక్రవర్తి వెల్లడించారు.  

హైదరాబాద్‌‌‌‌లో గురువారం (సెప్టెంబర్ 19) జరిగిన 'కోల్డ్ చైన్ అన్‌‌‌‌బ్రోకెన్ 2025' సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం లాజిస్టిక్స్ పాలసీ 2.0ను రూపొందిస్తోందని, ఇది మౌలిక సదుపాయాల లోపాలను పూడ్చి, కొత్త వృద్ధి కారిడార్లను సృష్టించేందుకు వ్యాపారాలతో కలిసి పనిచేస్తుందని ప్రకటించారు. 

దీనివల్ల మందులు, తాజా ఆహారం లాంటి ముఖ్యమైన వస్తువులను వేగంగా, సురక్షితంగా డెలివరీ అవుతాయని పేర్కొన్నారు.  తెలంగాణ దుబాయ్, సింగపూర్ లాంటి అంతర్జాతీయ మోడళ్లతో సమానంగా లాజిస్టిక్స్ హబ్‌‌‌‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.