స్కిల్, ఎడ్యుకేషన్ హబ్​గా తెలంగాణ

స్కిల్, ఎడ్యుకేషన్ హబ్​గా తెలంగాణ

న్యూఢిల్లీ, వెలుగు: స్కిల్, ఎడ్యుకేషన్​కు తెలంగాణ హబ్​గా మారుతోందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్​ఈ) వైస్ చైర్మన్, ఆర్జీయూకేటీ బాసర వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ వెంకట రమణ అన్నారు. గురువారం ఢిల్లీలో ఇండియా డిడాక్టిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఎమర్జింగ్ వికసిత్ భారత్–2047’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి వెంకట రమణ హాజరయ్యారు.

 ‘హయ్యర్ ఎడ్యుకేషన్ పాలసీ ఎక్స్చేంజ్’ అంశంలో చేపట్టిన రౌండ్ టేబుల్ చర్చలో ప్యానలిస్ట్ గా ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు బడ్జెట్​లో నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ నిర్ణయంతో వర్సిటీల్లో క్వాలిటీ, స్కిల్ ఎడ్యుకేషన్ అందించేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. విద్యార్థులకు అవకాశాలను కల్పించడం, పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి శిక్షణ అవసరమన్నారు. ప్రముఖ వర్సిటీల ప్రొఫెసర్ల ఎక్స్చేంజ్ తో నైపుణ్య అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.