
- బ్రజేశ్ ట్రిబ్యునల్‌ను కోరిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్, వెలుగు: స్టేట్ ఆఫ్కేస్(ఎస్వోసీ) దాఖలుకు ఐదు వారాల గడువు ఇవ్వాలని బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ను తెలంగాణ కోరింది. ఈ మేరకు ట్రిబ్యునల్ లో పిటిషన్దాఖలు చేసింది. ఇంటర్‌స్టేట్ వాటర్డిస్ప్యూ ట్స్యాక్ట్–1956లోని సెక్షన్–3 కింద ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పున:పంపిణీ అంశాన్ని బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు ఎలా అన్యాయం జరిగింది, బేసిన్పారామీటర్, బేసిన్వెంట నివసించే జనాభా, పరీవాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతాలు సహా నదీ జలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఎస్వోసీ దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని ట్రిబ్యునల్నీటి పంపకాలు చేయాల్సి ఉంటుంది. తమకు ఆరు వారాల సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్దాఖలు చేసింది.