
హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మృతిపట్ల సభ్యులు నివాళులర్పించారు. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారిక ప్రకటన చేయనున్నారు. తర్వాత పద్మారావుగౌడ్‌ను అభినందిస్తూ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నాయకులు ప్రసంగించనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. ఆ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది.