యూకే పార్లమెంటులో తెలంగాణ అసెంబ్లీ బృందం

యూకే పార్లమెంటులో తెలంగాణ అసెంబ్లీ బృందం
  • హౌజ్ ఆఫ్ లార్డ్స్, హౌజ్ ఆఫ్ కామన్స్ పరిశీలన 

వికారాబాద్, వెలుగు: లండన్​లోని ప్యాలెస్ ఆఫ్ వెస్ట్ మిన్ స్టర్ లో ఉన్న గ్రేట్ బ్రిటన్ హౌజ్ ఆఫ్ పార్లమెంట్​ను తెలంగాణ అసెంబ్లీ బృందం సందర్శించింది. అందులోని హౌజ్ ఆఫ్ లార్డ్స్, హౌజ్ ఆఫ్ కామన్స్ ను పరిశీలించింది. బార్బడోస్ దేశంలో జరిగిన 68వ కామన్​వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) కాన్ఫరెన్స్ అనంతరం స్టడీ టూర్​లో భాగంగా యూకేలో తెలంగాణ అసెంబ్లీ బృందం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నర్సింహా చార్యులు, అధికారులు బ్రిటీష్ పార్లమెంట్ ను సందర్శించారు.