
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేషం చోటుచేసుకుంది. ఇరిగేషన్ పై శ్వేతపత్రం చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. అసలు తనను కెమెరాలో చూపించరా? అని స్పీకర్ ను అడిగారు. మా ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు.. నేను మాట్లాడుతుంటే నన్ను చూపించకుండా మిగతా వారందరిని ఎలా చూపెడతారు?. ముఖాలు కూడా చూపించకుండా ఎందుకింత అన్యాయం, ఎందుకింత వివక్ష అని అన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ అలా ఏమీ లేదు, అందర్నీ చూపిస్తామని భరోసా ఇచ్చారు.
మేడిగడ్డ డ్యామేజ్ ఘటన దురదృష్టకరమన్నారు హరీశ్ రావు. ఏ విచారణకైనా సిద్దమన్నారు. తమపై కోపం ఉన్న ఫర్వాలేదు కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. వర్షాకాలం వచ్చేలోపు ప్రాజెక్ట్ రిపేర్ చేయాలని సూచించారు. కేసీఆర్ పేరును చెడగొట్టడమే సీఎం రేవంత్ ఉద్దేశమన్నారు. కావాలనే ప్రాజెక్ట్ రిపేర్ ని ఆలస్యంచేస్తున్నారని చెప్పారు. లేకపోతే రిపేర్ చేయడానికి ఎందుకంత ఆలస్యమని ప్రశ్నించారు హరీశ్ రావు.