11 గంటలకు ఉభయ సభల ఉమ్మడి మీటింగ్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి మొదలవుతున్నాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, మండలి ఉమ్మడి మీటింగ్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడుతుంది. ఆ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆదివారం ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అసెంబ్లీలో, శాసనసభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి మండలిలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం రెండు సభలు వాయిదా పడతాయి. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు రెండు సభలకు సెలవు ఉంటుంది. సోమవారం హోలీ పండుగ కూడా ఉండటంతో ఆ రోజు సభా వ్యవహారాలు జరిగే అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కొత్త చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనుంది. కొత్త రెవెన్యూ చట్టం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతా రాలేదని తెలిసింది.
ఆంగ్లో ఇండియన్ఎమ్మెల్యేతో కలిపి అసెంబ్లీలో 120 మంది సభ్యులు ఉంటారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపుతో.. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104కు పెరిగింది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్తోనే ఉన్నారు. ఏడుగురు సభ్యులతో ఎంఐఎం రెండో పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యులు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.
మండలి చైర్మన్‌కు కొత్త చాంబర్
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి గురువారం కొత్త చాంబర్‌ను ప్రారంభించారు. చాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మండలి చీఫ్ విప్వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
రేపు కేబినెట్ సమావేశం
రాష్ట్ర కేబినెట్ శనివారం సాయంత్రం సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్‌లో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయటంతో పాటు పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఆదివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో చేసే తీర్మానంతోపాటు కొత్త రెవెన్యూ చట్టంపైనా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
For More News..
