టీటీడీలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు అనుమతించాలి

టీటీడీలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు అనుమతించాలి
  • ఏపీ సీఎం చంద్రబాబును కోరిన తెలంగాణ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ 

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) తెలంగాణ ప్రజా ప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను అనుమతించా లని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయు డును తెలంగాణ స్పీకర్ ​గడ్డం ప్రసాద్ కుమార్​ కోరారు. ఆదివారం చంద్రబాబు ను హైదరాబాద్​లోని ఆయన నివాసంలో గడ్డం ప్రసాద్​ కలిశారు. టీటీడీలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లను అనుమతించాలని కోరారు. కొన్నేండ్లుగా తెలంగాణ ఎమ్మెల్యేలు ఇస్తున్న లెటర్లు చెల్లడం లేదని భక్తులు నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరారు.