‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన ఆటోడ్రైవర్ల జేఏసీ

‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన ఆటోడ్రైవర్ల జేఏసీ

హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ భవన్ నుండి అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ఆటోడ్రైవర్లను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఆటోమీటర్ల చార్జీలు పెంచలేదని ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశం చెప్పారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఆర్టీఏలో స్క్రాప్ విధానాన్ని క్రమబద్దీకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘వాహన మిత్ర’ పథకం తరహాలో తెలంగాణలోనూ ఆటోడ్రైవర్లకు రూ.10 వేల ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.