- రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్ డిమాండ్
- ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సంఘం ఆధ్వర్యంలో ధర్నా
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీల 42% రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించి, 9 వ షెడ్యూల్డ్ చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. రాజ్యాధికారంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన రిజర్వేషన్ల బిల్లులను చట్టరూపంలోకి తేవాలని కోరారు.
బీసీలకు చట్ట సభల్లో 50% రిజర్వేషన్ల బిల్లును కూడా పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు 50%రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చెయ్యాలని కోరారు.

