కేసీఆర్ వల్లే తెలంగాణ అన్నపూర్ణగా మారింది : జగదీశ్ రెడ్డి

కేసీఆర్ వల్లే తెలంగాణ అన్నపూర్ణగా మారింది : జగదీశ్ రెడ్డి

ప్రధాని మోడీ, బీజేపీ పార్టీపై బీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి ద్వజమెత్తారు. కేతపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్యీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మోడీ పాలనను తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఏవైతే హామీలు ఇచ్చారో.. అధికారంలోకి వచ్చాక అవి అమలు చేశారని, గత పాలకులు చేయని అభివృద్ధి కేసీఆర్ చేశారని ప్రజలకు గుర్తు చేశారు. వేరే జెండాలు, ఎజెండాలు ఏ గ్రామానికి వచ్చిన ప్రజలు తిరస్కరించాలని కోరారు.

మోడీ సొంత రాష్ట్రం.. గుజరాత్ లో రూ. 600 పెన్షన్ ఇస్తే.. తెలంగాణలో వికలాంగులకు 3వేలు, వృద్ధులకు రూ,2  ఇస్తున్నారని తెలిపారు. రైతులను పట్టించుకోని బీజేపీ సర్కార్.. గుజరాత్ లో రైతులకు ఆరుగంటల కరెంట్ ఇస్తూనే.. మోటర్లకు మీటర్లు పెట్టారని గుర్తు చేశారు. 

వంటగ్యాస్ దగ్గర నుండి పెట్రోల్, టోల్గేట్ చార్జీల పన్నులు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారు. పన్నుల రూపంలో ప్రజలందరి జేబులు కొడుతున్నాడని విముర్శించారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రైతులు ఇబ్బంది పడుతూ కేసీఆర్ వైపు చూస్తున్నారని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.