బీజేపీ మ్యానిఫెస్టో విడుదల : కీలక హామీలు ఇవే

బీజేపీ మ్యానిఫెస్టో విడుదల : కీలక హామీలు ఇవే

తెలంగాణ బీజేపీ ఎన్నికల హామీలను ప్రకటించింది. రిజర్వేషన్లతోపాటు రైతులు, ఆధ్యాత్మికానికి సంబంధించి ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసింది బీజేపీ పార్టీ.

బీజేపీ మ్యానిఫెస్టోలో కీలక హామీలు ఇవే

* రైతులకు ప్రతి సంవత్సరం రూ.18 వేలు 

* ఆడపిల్ల పుట్టగానే రెండు లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్

* కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి విచారణకు కమిటీ ఏర్పాటు

* మహిళా రైతుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు

* ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగాల నియామకాలు. యూపీఎస్సీ తరహాలో నియామకాలు, నోటిఫికేషన్లు

* ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థ ఏర్పాటు

* అర్హులైన పేదలకు ఉచితంగా ఇంటి పట్టాలు

* డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు

* ప్రతి మండలంలో నోడల్ స్కూల్స్ ఏర్పాటు

* నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ

* పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు

* అధికారంలోకి రాగానే బీసీ సీఎం హామీ

* సమ్మక్క-, సారక్క మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు

* ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ

* ప్రతి రైతుకు ఉచిత పంట బీమా అమలు చేయటం

*  వరికి 3 వేల 100 రూపాయల మద్దతు ధర

*  పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు

* ఆసక్తి ఉన్న రైతులకు దేవీ ఆవులను ఉచితంగా అందించడం

* జాతీయ పసుపు బోర్డు నిర్ణయానికి అనుగుణంగా నిజామాబాద్ టర్మరిక్ సిటీని అభివృద్ధి చేయటం

* ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న రిజర్వేషన్లను పున:పరిశీలించి, గిరిజన వర్గాల రిజర్వేషన్లను జనాభాకు అనుగుణంగా పెంచేలా హామీ

* ఎస్సీల్లో వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం

* ఇండోర్ తరహాలో పారిశుధ్య కార్మికులను వేస్ట్ మేనేజ్ మెంట్ లో సహ యజమానులుగా గుర్తించడం

* ప్రభుత్వ శాఖల్లోని ఎస్సీ, ఎస్టీల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయటం

* అయోధ్య, కాశీలకు వయోవృద్ధులకు ఉచిత యాత్రలు నిర్వహించటం

* దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం 25 లక్షల రూపాయల వరకు తాకట్టు లేని.. తక్కువ వడ్డీకే రుణాలు