బీఆర్ఎస్ లో చేరిన గ్రేటర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు

బీఆర్ఎస్ లో చేరిన  గ్రేటర్ బీజేపీ మాజీ అధ్యక్షుడు

 

  • కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన వెంకటరెడ్డి
  • సతీమణి, బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మావతి తో కలిసి చేరిక
  • 43 ఏండ్లు గా పనిచేస్తున్నా గుర్తింపు లేదంటూ కంటతడి

హైదరాబాద్: బీజేపీకి ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు వెంకట రెడ్డి, ఆయన సతీమణి, బాగ్ అంబర్ పేట కార్పొరేటర్ పద్మావతి రెడ్డి రాజీనామా చేశారు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అంబర్ పేట టికెట్ ఆశించిన తనకు న్యాయం జరగడం లేదని కలత చెందే రాజీనామా చేశారు. ఈ విషయమై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని కలిసేందుకు యత్నించగా ఆయన నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తాను గతంలో రెండు సార్లు బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేశానని, రెండు సార్లు మలక్ పేట నుంచి పోటీ చేశానని, ఈ సారి అంబర్ పేట అసెంబ్లీ టికెట్ ఆశించానని వెంకట రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని కిషన్ రెడ్డితో చర్చించేందుకు యత్నించారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తాను ఎవరినీ నిందించడం లేదని, సముచిత స్థానం దక్కనందునే పార్టీని వీడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి పంపుతున్నట్టు తెలిపారు.