నమామి గంగా తరహాలో నమో మూసీ ప్రక్షాళన: లక్ష్మణ్

నమామి గంగా తరహాలో నమో మూసీ ప్రక్షాళన: లక్ష్మణ్

మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. శనివారం వికారాబాద్ జిల్లాలో మూసి జన్మస్థలం అనంతగిరి వద్ద  ఆయన ప్రత్యేక పూజలు చేశారు. నమామి మూసి పేరుతో మూసీ ప్రక్షాళన ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసినదికి గొప్ప చరిత్ర ఉంది, అనంత గిరి కొండల్లో మొదలై.. హైదరాబాద్ గుండా ప్రయాణించి, సూర్యాపేట వద్ద మూసీ.. కృష్ణ లో కలుస్తుంది.  ఆ పవిత్ర నది హైదరాబాద్ లో పరిశ్రమల వ్యర్థాలు కలవడం వల్ల కలుషితం అవుతోందన్నారు. ప్రభుత్వం పాలకుల నిర్లక్ష్యంతో మూసి కలుషితమై పోయిందన్నారు. ప్రక్షాళనకై అనంతగిరి పద్మనాభ స్వామి గుడి నుండి బీజేపీ సంకల్పం తీసుకుందన్నారు లక్ష్మణ్. మూసీ ప్రక్షాళన విషయం లో నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుంటామని నమామి గంగా తరహాలోనే నమో మూసీ ప్రక్షాళన కు పోరాటం చేస్తామన్నారు.

మూసీ ప్రక్షాళన చేసే వరకు దశల వారిగా పోరాటం కొనసాగిస్తామన్నారు లక్ష్మణ్.  ఈ నెల 16న హైదరాబాద్ లోని బాపూ ఘాట్ లో ప్రతిజ్ఞ తీసుకుంటామని 17న సూర్యాపేట వెళ్ళి కలుషితం అయిన మూసీ ని పరిశీలిస్తామని అన్నారు. కలుషితం అయిన నీటి తో పంటపొలాలు కూడా కలుషితం అవుతున్నాయని, మూసి ఉద్యమానికి ప్రజలందరూ కలిసి రావాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.