మే 31న విజయ్ కనిష్క హిట్ లిస్ట్ రిలీజ్

మే 31న  విజయ్ కనిష్క హిట్ లిస్ట్ రిలీజ్

తమిళ దర్శకుడు విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా దర్శకుడు కేఎస్ రవికుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘హిట్ లిస్ట్‌‌‌‌’. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకులు. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ కీలక పాత్రలు పోషించారు. ఈనెల 31న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మురళీమోహన్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని విష్ చేశారు. 

కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ ‘విక్రమన్ గారు నన్ను దర్శకుడిగా పరిచయం చేయగా, ఆయన కొడుకును నేను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అన్నారు. హీరో విజయ్ కనిష్క  మాట్లాడుతూ ‘మా నాన్న తెలుగులో తీసిన ‘వసంతం’ సినిమాకు ప్రేక్షకులు మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు కూడా అలాంటి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నా’ అన్నాడు. దర్శకులతో పాటు తెలుగులో రిలీజ్ చేస్తున్న శ్రీనివాస్ గౌడ్, బెక్కం రవీంద్ర పాల్గొన్నారు.