
న్యూఢిల్లీ : దాదాపు రూ.70 వేల కోట్ల (8.5 బిలియన్ డాలర్ల) విలువైన వయాకామ్18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనానికి అనుమతి ఇవ్వాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ను రిలయన్స్ ఇండస్ట్రీస్ కోరింది. వయాకామ్18 కు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌లు, స్టార్ ఇండియాను విలీనం చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీలు జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి.
ఈ ట్రాన్సాక్షన్ వలన దేశంలోని ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌లో కాంపిటీషన్‌పై ఎటువంటి నెగెటివ్ ప్రభావం ఉండదని సీసీఐకు ఫైల్ చేసిన నోటీసులో రిలయన్స్ పేర్కొంది. కానీ, విలీనంతో లైసెన్సింగ్ ఆడియో విజువల్ కంటెంట్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్రాడ్‌కాస్ట్ టీవీ ఛానల్స్, ఆడియో విజువల్ కంటెంట్ ప్రొవిజన్, యాడ్స్ సప్లయ్ వంటి విభాగాల్లో ఓవర్‌ల్యాప్స్ ఉంటాయని వివరించింది. స్టార్ ఇండియా టీవీ బ్రాడ్ కాస్టింగ్, సినిమా
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణ వంటి వివిధ బిజినెస్‌లలో ఉంది. వయోకామ్18 బ్రాడ్‌కాస్టింగ్ టీవీ ఛానల్స్, ఓటీటీ నిర్వహణలో ఉంది. అంతేకాకుండా సినిమా డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్‌లో కూడా ఉంది. వయాకామ్18, స్టార్ ఇండియా విలీన సంస్థకు చైర్‌పర్సన్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ వైఫ్ నీతా అంబానీ, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ పని చేస్తారు.