
పారిస్ : మట్టి కోర్టులో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఆదివారం మొదలవనుంది. టోర్నీలో స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్‌పైనే అందరి ఫోకస్ ఉండనుంది. ఈ టోర్నీలో అత్యధికంగా 14 సార్లు విజేతగా నిలిచిన నడాల్ గాయం కారణంగా గత సీజన్‌లో ఆడలేదు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగుతున్న నడాల్ తొలి రౌండ్‌లో నాలుగో సీడ్ జ్వెరెవ్‌తో పోటీ పడనున్నాడు. ఇండియా ప్లేయర్ సుమిత్ నాగల్ తొలి రౌండ్‌లో కారెన్ కచనోవ్‌తో తల పడనున్నాడు.