పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..హాల్ టికెట్లు రిలీజ్

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..హాల్ టికెట్లు రిలీజ్

పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని.. డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. మార్చి 24వ తేదీ ఉదయం www.bse.telangana.gov.in వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అటు హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయుని సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తామని బోర్డు ప్రకటించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక రోజు ముందే తమ పరీక్షా కేంద్రానికి వెళ్లి అడ్రస్ సరి చూసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు కంట్రోల్ రూమ్ నెంబర్ 9030282993 కు ఫోన్ చేయాలని కోరింది. 

పరీక్షల షెడ్యూల్..

ఏడాది ఏప్రిల్ 3న పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథ్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్ స్టడీస్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే సైన్స్‌ పరీక్షను మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. 

బిట్ పేపర్ కోసం 15 నిమిషాలు..

ఈ సారి పదో తరగతి పరీక్షల్లో భాగంగా మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నాపత్రం రాసేందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇ‍వ్వనున్నారు. గతంలో బిట్‌ పేపర్‌కు 30 నిమిషాల సమయం ఇచ్చేవారు. ప్రస్తుతం దాన్ని 15 నిమిషాలకు కుదించారు. పరీక్ష ఆఖర్లో మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నల పత్రాన్ని ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు చివరి15 నిమిషాల్లోనే దానికి సమాధానాలు రాయాలని సూచించారు. 15 నిమిషాల్లోనే విద్యార్థులు 10 మల్టీపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.