దేశం, ప్రాంతం ప్రేమకు అడ్డు కావని నిరూపించారు

దేశం, ప్రాంతం ప్రేమకు అడ్డు కావని నిరూపించారు

అమెరికా అమ్మాయి.. మల్యాల అబ్బాయి.. ఇద్దరు తమ దేశం, ప్రాంతం, భాష ప్రేమకు అడ్డు కావని నిరూపించి ప్రేమ వివాహం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన ముస్కెం ప్రభు ఉన్నత చదువులకై అమెరికా వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తుండగా టెక్సాస్ ప్రాంతానికి చెందిన సిసీలియా అనే అమెరికా అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి మనసులు కలవడంతో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని అనుకున్నారు. 

ఈ మేరకు సిసీలియా అనే యువతి ఇండియాకు చేరుకుంది. ఇరు కుటుంబాలు వీరి అంగీకరించారు. దీంతో వీరి వివాహం స్థానిక  ఫంక్షన్ హాల్ లో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో బంధువుల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.