ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 5 వేల కోట్లు..76 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు స్పీడప్

ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 5 వేల కోట్లు..76 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులు స్పీడప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్(వైఐఐఆర్) గురుకులాలకు ప్రభుత్వం రూ.5,500 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ గురుకులాలను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులందరూ ఒకే క్యాంపస్‌లో చదువుకునేలా ఈ ప్రాజెక్టును రూపుదిద్దుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో గురుకులాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటివరకు 79 నియోజకవర్గాల్లో మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో 44 చోట్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఒక్కో గురుకులాన్ని సుమారు 25 ఎకరాల్లో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వివరించారు. 2026–-27 ఆర్థిక సంవత్సరానికి అధికారులు రూ.9,800 కోట్లను ప్రతిపాదించగా, ప్రభుత్వం ప్రస్తుతానికి రూ.5500 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.