కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష

కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష

కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందన్నారు మంత్రి హరీశ్ రావు. 7 మండలాలను ఏపీలో కలిపారన్నారు. ఐటీఐఆర్ పై కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. వెనకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. పీఎంకు  సీఎం చెప్పినా పట్టించుకోలేదన్నారు. మిషన్ భగీరథ,మిషన్ కాకతీయకు నిధులివ్వలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వడం లేదన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి దిక్కులేదన్నారు. కాజీపేట రైల్వేస్టేషన్ వివక్ష చూపుతోందన్నారు. ఎఫ్ఆర్ బీఎమ్ విద్యుత్ సంస్కరణలకు లింకు పెట్టిందన్నారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు..ఒక్క పథకానికి నిధులు ఇవ్వలేదన్నారు.కరోనా సమయంలో దేశ వృద్ధి రేటు మైనస్ లో ఉన్నా..తెలంగాణ వృద్ధి రేటు రెండుకు పైగా ఉందన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని అన్నారు.