ఇది ప్రజా వంచన బడ్జెట్..ఆరు గ్యారంటీలకు పాడె కట్టారు : కేంద్ర మంత్రి బండి సంజయ్ 

ఇది ప్రజా వంచన బడ్జెట్..ఆరు గ్యారంటీలకు పాడె కట్టారు : కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, భ్రష్టుపట్టించారు
  • ఆదాయం పెంపు లేదు కానీ, అప్పులకు సిద్ధపడ్డరు 
  • రూ.4 వేల పెన్షన్ ఏది? నిరుద్యోగ భృతి ఏది?
  • 56 శాతం ఉన్న బీసీలకు 4 శాతం నిధులే కేటాయిస్తరా? అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా వంచన బడ్జెట్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సామాన్యులకు ఒరిగేదేమీ లేదని, ఆరు గ్యారంటీలకు ఈ బడ్జెట్‌తో పాడె కట్టారని మండిపడ్డారు. బడ్జెట్ పై శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో స్పందించారు. ఆదాయం పెంచే మార్గం చూపలేదు కానీ, మరో రూ.లక్ష కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమవ్వడం సిగ్గుచేటన్నారు. రైతు భరోసా నిధులను రెండు విడతలుగా ఎగ్గొట్టారని, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు ఇస్తామన్న తులం బంగారం తుస్సు మనిపించారని, రూ.2500 ఆర్థిక సాయం ఊసే లేదని ఎద్దేవా చేశారు. అవ్వాతాతలకు ఇచ్చే రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదని, విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల భరోసా కార్డుకు రూపాయి కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం 4 శాతం కేటాయించడం ఏ రకమైన సామాజిక న్యాయమని బండి సంజయ్ ప్రశ్నించారు.