Exclusive : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫస్ట్ కేబినెట్ మీటింగ్

Exclusive : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫస్ట్ కేబినెట్ మీటింగ్

తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ కేబినెట్ మీటింగ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో.. మంత్రులు సమావేశం అయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని.. ప్రజలకు ఇచ్చిన హామీ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రులు. ప్రమాణ స్వీకారం సమయంలోనే.. అభయ హస్తం పేరు.. గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.