తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ అధ్యక్షతన స్టేట్ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. భేటీలో ధాన్యం కొనుగోలుపై ప్రధానంగా చర్చ జరగనుంది. యాసంగి పంటల మార్పిడి ప్రణాళికలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరి కాకుండా వేసే పంటలకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడంపై కేబినెట్ భేటీలో చర్చిస్తున్నారు. విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు, దళిత బంధు, ఉద్యోగాలభర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

కరోనా కొత్త వేవ్ కట్టడికి చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్. కొత్త వేరియంట్ పై వైద్య అధికారులు కేబినెట్ కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితి తెలుపుతూ నివేదిక సమర్పించారు. అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితిననా ఎదుర్కోవడానికి రాష్ట్ర వైద్యశాఖ సిద్దంగా వుండాలని కేబినెట్ ఆదేశించింది.  ధరణి, పోడు భూముల సబ్ కమిటీల నివేదికలపై ఇవాళ్టి మంత్రి మండలిలో నిర్ణయాలు తీసుకోనున్నారు. దాదాపు 12 అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం.