కేబినెట్ భేటీ జూలై 28కి వాయిదా

కేబినెట్ భేటీ జూలై 28కి వాయిదా

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర కేబినెట్ భేటీ ఈ నెల 28కి వాయిదా పడింది. షెడ్యూల్​ ప్రకారం శుక్రవారమే మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. కానీ, ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండడంతో కేబినెట్ ​భేటీని సీఎం రేవంత్​ రెడ్డి వాయిదా వేశారు. ఏఐసీసీ ఓబీసీ సమ్మేళనంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌‌‌, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి శుక్రవారం ఢిల్లీలోనే ఉన్నారు. 

వీరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డికూడా ఢిల్లీ పర్యటనలో ఉండడంతో మంత్రి వర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.