స్కూల్ ఫీజులపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

స్కూల్ ఫీజులపై ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఫీజులను కంట్రోల్ చేసేందుకు గైడ్​లైన్స్ రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం భేటీ కానున్నది. ఎంసీఆర్​హెచ్​ఆర్డీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. కమిటీలో మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్ ​యాదవ్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్​గౌడ్, జగదీశ్​రెడ్డి, ప్రశాంత్​రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు మెంబర్లుగా ఉన్నారు. ఫీజులపై ఇప్పటికే పలు జీవోలు ఇచ్చినా, ఏదో ఓ అంశాన్ని తీసుకుని మేనేజ్‌మెంట్లు కోర్టుకు వెళ్లి అమలు కాకుండా అడ్డుపడుతున్నాయి.

దీంతో చట్టం చేయడమే మంచిదని భావించిన సర్కారు.. గత కేబినెట్ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగే మీటింగ్​లో ఫీజులను ఎలా ఖరారు చేయాలి? ఎలాంటి నిబంధనలు పెట్టాలనే దానిపై, గతంలో ఫీజుల అంశంపై ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన రిపోర్టుపైనా చర్చించనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఫీజుల చట్టంపై బిల్లు ప్రవేశపెట్టాలని సర్కారు భావిస్తోంది. అయితే కేవలం స్కూళ్లకే పరిమితం అవుతారా? లేక ఇంటర్​తో పాటు ఇతర కోర్సుల ఫీజులపైనా? చర్చిస్తారా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.