
జూన్ 16న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. . ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాక రైతు భరోసా నిధుల సమీకరణపై చర్చించే అవకాశం ఉంది.
మరోవైపు ఈ నెలాఖరులో గా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రేపు నిర్వహించే క్యాబినెట్ సమావే శంలో చర్చించిన అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.