కచ్చితత్వంతో ఓటరు జాబితా ఉండాలి : సి. సుదర్శన్ రెడ్డి

కచ్చితత్వంతో ఓటరు జాబితా ఉండాలి : సి. సుదర్శన్ రెడ్డి
  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి. సుదర్శన్ రెడ్డి 

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి. సుదర్శన్‌ రెడ్డి శనివారం తెలంగాణలోని అన్ని ఇఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటరు జాబితా స్పెషల్​ ఇంటెన్సివ్ రివిజన్​, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల అంశాలను ఆయన సమీక్షించారు. 

ఓటరు జాబితా నవీకరణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం, ఫీల్డ్‌ ధ్రువీకరణ, డేటా ఎంట్రీ కచ్చితత్వం వంటి ముఖ్య అంశాలపై సీఈఓకు అధికారులు నివేదికలు సమర్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సర్ ప్రతి దశలోనూ కచ్చితత్వం, జాగ్రత్త, సమయపాలన పాటించాల్సిందేనని ఆయన సూచించారు. 

సర్​‌కు సంబంధించిన పెండింగ్‌ పనులను వేగంగా పూర్తి చేసి, ఓటర్‌ జాబితా నాణ్యతను మరింత మెరుగుపర్చే దిశగా శ్రద్ధగా పనిచేయాలని ఆదేశించారు.