బెట్టింగ్ యాప్స్ పై సీఐడీ ఫోకస్.. 8 మంది అరెస్ట్.. బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్..

బెట్టింగ్ యాప్స్ పై సీఐడీ ఫోకస్.. 8 మంది అరెస్ట్..  బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్..

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ కేసులో దేశవ్యాప్తంగా తెలంగాణ సీఐడీ సెన్సేషన్ ఆపరేషన్ చేపట్టింది. గుజరాత్, రాజస్థా న్, పంజాబ్ రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది . ఆరు బృందాలతో ఆపరేషన్ చేపట్టి 8 మంది ఆపరేటర్లను అరెస్టు చేసింది. వీరంతా ఆరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను వాడినట్లు అధికారులు గుర్తించారు. తాజ్ 007, ఫెయిర్ ప్లే లైవ్, ఆంధ్ర 365 బెట్టింగ్, వీఎల్ బుక్, తెలుగు 365, యస్ 365 యాప్ ను ఈ ముఠా నిర్వహిస్తోంది. 

బెట్టింగ్ యాప్ ఆపరేటర్లు పబ్లిక్ నుంచి కోట్ల రూపాయలు దోచుకున్నట్లు తేల్చారు. తనిఖీల్లో భాగంగా భారీగా డేటాతో పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసిన అధికారులు ఈమెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు అధికారులు. మిగిలిన నిందితుల కోసం సిట్ బృందం ముమ్మరంగా గాలింపు చేపట్టిందని తెలిపారు అధికారులు.