Aha SIFF2024: 24 క్రాఫ్ట్స్ సిబ్బందికి సంక్షేమం అందిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Aha SIFF2024: 24 క్రాఫ్ట్స్ సిబ్బందికి సంక్షేమం అందిస్తాం: మంత్రి  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి

ముందు చిన్న సినిమాలతో మొదలైన ఆహా (Aha) ఓటీటీ ప్రస్తానం..తరువాత టాక్ షోస్, గేమ్ షోస్ తో మంచి ఫాల్లోయింగ్ ను సంపాదించుకుంది. అంతేకాదు.. కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను తెరపైకి తీసుకొస్తూ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. నెట్‌ ఫ్లిక్స్, అమెజాన్‌, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5 వంటి పాపులర్‌ ఓటీటీ సంస్థలలాగే ఆహా కూడా మంచి వ్యూయర్ షిప్ తో ముందుకు సాగుతోంది.

అయితే తాజాగా ఆహా ఓటీటీ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (SouthIndiaFilmFestival) నిర్వహించింది.ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 

ఈ సందర్బంగా మంత్రి కోమటి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..'భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు ఇండస్ట్రీది ఒక ప్రత్యేక స్థానం అన్నారు.తెలుగు సినిమా ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లిందో చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.ఇపుడు తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరింది.తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండదండలు అందిస్తుంది. అలాగే 24 క్రాఫ్ట్స్ సిబ్బందికి సంక్షేమానికి భరోసా అందిస్తాం అని తెలిపారు.ఆహా ఓటీటీ సౌత్ ఇండియా అవార్డ్స్ నిర్వహించడం గొప్ప విషయం అంటూ మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్,డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.