సీజేఐతో సీఎం రేవంత్ రెడ్డి

సీజేఐతో సీఎం రేవంత్ రెడ్డి

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్  గౌరవార్థం శనివారం శంషాబాద్​లోని హోటల్ నోవాటెల్​లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి జస్టిస్ సూర్యకాంత్​ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, బొకేతో సన్మానించారు. విందులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఇతర న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.