
పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సీఎం రేవంత్ పై నమోదైన పిటీషన్ ను సోమవారం (సెప్టెంబర్ 08) డిస్మిస్ చేసింది కోర్టు. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు రేవంత్ పై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ ఎఫ్ఐఆర్ ను అప్పట్లో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత.
ALSO READ : బ్రాండింగ్కు రోల్ మోడల్గా గాంధీ హాస్పిటల్..
సోమవారం వాదనల సందర్భంగా పిటీషన్ ను డిస్మిస్ చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయితో కూడిన ధర్మాసనం. కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ఈ సందర్భంగా పిటిషనర్ కు ధర్మాసనం హితబోధ చేసింది.