గవర్నర్​తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

గవర్నర్​తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
  • రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​లోని రాజ్​భవన్​లో  గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి భేటీ అయ్యారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–-పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సోమవారం వీరిరువురూ సమావేశమైనట్టు సమాచారం. హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముఖ్యమంత్రి వివరించినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు పాల్గొన్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తున్నది.

   శాంతి భద్రతల పరిస్థితితోపాటు సైనిక స్థావరాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై డిస్కస్​చేసినట్టు సమాచారం. ఆర్టీఐ ఫైళ్ల క్లియరెన్స్ పై గవర్నర్ తో సీఎం మాట్లాడారు. ఆ వెంటనే  గవర్నర్​ నలుగురు కమిషనర్ల నియమాకానికి ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపడంతో  సీఎస్​ ఉత్తర్వులు జారీ చేశారు.