తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న రైతు దినోత్సవంపై కాంగ్రెస్ నాయకులు రివర్స్ అటాక్ చేస్తున్నారు. హామీలు ఇచ్చి.. వాటిని నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రభుత్వ పెద్దలపై జాబ్ కార్డు ఉద్యమానికి తెరలేపారు. పాలేరు నియోజక వర్గంలో టీపీసీసీ మెంబర్ రాయల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతులు ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
తొమ్మిదేళ్లలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేశాక సంబరాలు జరపాలంటూ రైతులు తెలంగాణ ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు పంపారు. అలాగే, 2018 మ్యానిఫెస్టోలో ప్రకటించిన 'రైతు రుణమాఫీ' ఏమైందంటూ వారు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ జాబ్ కార్డు ఉద్యమం రాష్ట్రంలో సంచలంగా మారింది.
