బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశం

బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశం
  • పాల్గొన్న  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం, కొండా, వాకిటి 

హైదరాబాద్, వెలుగు: రెండ్రోజుల పాటు జరగనున్న ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ బీసీ మంత్రులు, పీసీసీ చీఫ్  మంగళవారం బెంగళూరు వెళ్లారు. అక్కడ వీరికి కర్నాటక పీసీసీ బీసీ సెల్ నేతలు ఘన స్వాగతం పలికారు. వీరిలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఉన్నారు. మీటింగ్​లో భాగంగా పలు అంశాలపై వీరు ప్రసంగించనున్నారు.