సునీతారావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి : నాగరాజుగౌడ్

సునీతారావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి : నాగరాజుగౌడ్

ట్యాంక్ బండ్, వెలుగు: పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ పై మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి నాగరాజుగౌడ్ అన్నారు. వెంటనే ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరారు. సునీత రావు తీరును నిరసిస్తూ బీసీ సంఘాల నాయకులు గురువారం నెక్లెస్ రోడ్ లోని నీరా కేఫ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. నాగరాజు గౌడ్ హాజరై మాట్లాడారు. సునీతారావు నామినేటెడ్ పోస్టుకు కూడా అర్హురాలు కాదని.. ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాక మరొకసారి అవకాశం ఉండదు అనే నిబంధన పార్టీలో ఉందని గుర్తుచేశారు. రెడ్డి, గౌడ్ అనే పేరు ఉంటే కాంగ్రెస్ లో పదవులు వస్తాయని ఆరోపించడం సరికాదన్నారు. 

సునీతారావు చీకటి బాగోతం, మహిళలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో తమకు తెలుసున్నారు. పదవులు ఇప్పిస్తానని లక్షల దండుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, మహేశ్​కుమార్ గౌడ్ నేతృత్వంలో ప్రభుత్వం, పార్టీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోందన్నారు. సునీతారావును వెంటనే పార్టీ నుంచి తొలగించాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిని కోరతామన్నారు. సమావేశంలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కోట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.