కేరళ ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు

కేరళ ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
  •  నలుగురిని ఎంపిక చేసిన హైకమాండ్​

న్యూఢిల్లీ, వెలుగు: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ హైకమాండ్​తెలంగాణ నుంచి నలుగురు నేతలను ఎంపిక చేసింది. మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఆదివారం త్రివేంద్రంలోని కేరళ పీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ముఖ్య నేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎంపికైన నేతలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఏప్రిల్ 7 వరకు ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ విజయం కోసం కృషి చేయనున్నారు.