హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్​మెంట్​లో కౌన్సిల్​ది కీలక పాత్ర: కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి

హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్​మెంట్​లో కౌన్సిల్​ది కీలక పాత్ర: కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ లో తెలంగాణ ఉన్నత విద్యామండలి(టీజీసీహెచ్​ఈ) క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. ప్రతి ఉద్యోగి తమ, తమ స్థాయిల్లో విద్యాపరంగా దేశ, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మాసబ్ ట్యాంక్ లోని టీజీసీహెచ్ఈ ఆఫీసులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 

దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు పోరాడారని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్​కే మహమూద్, సెక్రెటరీ శ్రీరామ్ వెంకటేశ్, జాయింట్ సెక్రెటరీ సీఎస్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్​, ఇంటర్ బోర్డు, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్లలోనూ జాతీయ జెండావిష్కరణ కార్యక్రమాలు జరిగాయి.