ఐదు రాష్ట్రాల ఓటర్లకు  ప్రత్యేక సెలవులు

ఐదు రాష్ట్రాల ఓటర్లకు  ప్రత్యేక సెలవులు
  • ఈ నెల 9,23,29 తేదీల్లో 'పెయిడ్ హాలిడే' 

హైదరాబాద్, వెలుగు: ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నివ సిస్తున్న ఆయా రాష్ట్రాల ఓటర్లకు ప్రత్యేక సెల వులను ప్రకటించింది. అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఓటర్లకు ఈ నెల 9న, తమిళనాడు ఓటర్లకు ఏప్రిల్ 23, పశ్చిమ బెంగాల్ ఓటర్లకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో సెలవులను ప్రకటించింది.

ఈ మేరకు కార్మిక, ఉపాధి శాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఎన్నికలు జరుగుతున్న అసోం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల ఓటర్లు ఉద్యో గ రీత్యా లేదా ఇతర పనుల నిమిత్తం తెలంగాణలో స్థిరపడ్డారో.. వారందరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించింది. ఈ సెలవులను కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగాలకు కూడా వర్తింజేసింది.