ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని డైట్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని డైట్ కాలేజీల్లో  లెక్చరర్ పోస్టులు

వికారాబాద్​, వెలుగు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ  డైట్ కాలేజీల్లో లెక్చరర్​ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అబ్దుల్ ఘని ఆదివారం ప్రకటించారు. 

తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఇంగ్లిష్, గణితం, ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ, సైన్స్, తెలుగు, ఉర్దూ మీడియంలో ఫిలాసపీ, సోషియాలజీ, గణితం, సైన్స్, సాంఘికశాస్త్రం, ఉర్దూ సబ్జెక్టులు బోధించేవారు అర్హులని తెలిపారు. ఈ నెల 14 వరకు schooledu.telangana.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం 79950 87606 నంబర్​కు ఫోన్​ చేయాలని కోరారు.