- ప్రిన్సిపాళ్లకు ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సర్కారు జూనియర్ కాలేజీ బిల్డింగులకు తెల్లటి రంగు వేయించి, దానికి నీలిరంగు బోర్డర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. ఈ మేరకు డీఐఈఓలు, ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీచేశారు. అన్ని కాలేజీలూ యూనిఫార్మిటీ ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ పెయింటింగ్ ఖర్చులను మైనర్ రిపేర్ల నిధుల నుంచి తీసుకోవాలని సూచించారు.
