జపాన్​ లో భట్టి.. అక్టోబర్​ 1 నుంచి మూడు రోజుల టూర్​

జపాన్​ లో భట్టి.. అక్టోబర్​ 1 నుంచి మూడు రోజుల టూర్​

హైదరాబాద్, వెలుగు: వారం రోజుల అమెరికా పర్యటన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం మధ్యాహ్నం జపాన్ చేరుకున్నారు. హానిడా ఎయిర్​పోర్టులో ఆయనకు భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాష్  స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం వెంట ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణా రావు, ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఉన్నారు.

 జపాన్​లో మూడు రోజులు పర్యటించనున్న ఈ బృందం పర్యావరణహిత పరిశ్రమలు, అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు తదితర అంశాలపై  పరిశీలన చేయనుంది. ఇందులో భాగంగా జపాన్ లోని పలు  పరిశ్రమలను సందర్శించనుంది. సోమవారం సాయంత్రం భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన విందులో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలో జపాన్​ కంపెనీల పెట్టుబడులు, భాగస్వామ్యానికి గల అవకాశాలపై భట్టికి భారత రాయబారి సీబీ జార్జి వివరించారు.