తెలంగాణ ఈసెట్ ఫలితాలు రేపు(బుధవారం) రిలీజ్ కానున్నాయి.బుధవారం ఉదయం 11 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీఎస్ ఈసెట్-2021 కన్వీనర్ సీహెచ్ వెంకటరమణా రెడ్డి ప్రకటించారు.JNTU హైదరాబాద్ క్యాంపస్‌లోని UGC-HRDC ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, JNTUH వైస్ ఛాన్సలర్ కట్టా నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
